'ఇస్లామిక్ పాఠాలు తప్పనిసరి'.. కాలేజీ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్
- హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఇస్లామిక్ పాఠాల వివాదం
- వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
- తెలంగాణ విద్యాశాఖ అధికారులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ
- రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఇస్లామిక్ మతపరమైన పాఠాలు, ప్రార్థనలను తప్పనిసరి చేశారన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, రెండు వారాల్లోగా 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ఏటీఆర్) సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులకు, హైదరాబాద్ జిల్లా యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న 'సక్సెస్ ది జూనియర్ కళాశాల' యాజమాన్యం విద్యార్థుల అధికారిక డైరీలలో ఇస్లామిక్ పాఠాలు, ప్రార్థనలను హోంవర్క్‌గా ఇస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, యాజమాన్యం పదేపదే ఇందుకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై నిలదీయగా "పొరపాటున జరిగింది" అని యాజమాన్యం బదులిచ్చినప్పటికీ, వారు ఎటువంటి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని ఫిర్యాదుదారులు తెలిపారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం, ఈ ఆరోపణలు నిజమైతే ఇది విద్యార్థుల హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. ఇది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్యావ్యవస్థలోని లౌకిక స్ఫూర్తికి విఘాతమని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేస్తూ, సమగ్ర నివేదిక కోరింది.
ఇదే పేరుతో ఉన్న 'సక్సెస్ స్కూల్' ప్రాథమిక పాఠశాలలో కూడా ఇటీవల ఇటువంటి వివాదమే చెలరేగింది. ఒక హిందూ విద్యార్థికి 'కల్మా'ను కంఠస్థం చేయాలని హోంవర్క్ ఇచ్చిన రెండో తరగతి ఉపాధ్యాయురాలిని అప్పట్లో యాజమాన్యం తొలగించింది. తాజా ఘటనతో విద్యాసంస్థల్లో మతపరమైన సున్నితత్వ అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.