కేరళను చూసి నేర్చుకోవాలి: ఉచిత పథకాలపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Learn from Kerala Ayyanna Patrudu interesting comments on free schemes
  • మన రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న అయ్యన్న
  • రాష్ట్ర అభివృద్ధిలో కూడా తమవంతు బాధ్యత తీసుకోవాలని సూచన
  • అందరూ ఒక చెట్టు నాటితే రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతుందని వ్యాఖ్య
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందున తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఉచిత పథకాలపై మాట్లాడిన ఆయన, ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కేరళ ప్రజలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ ప్రజలు అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఉచిత పథకాలు ఏమి వస్తాయనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ అంశంపై కూడా స్పీకర్ స్పందించారు. కేరళలో ప్రజలు పెద్దఎత్తున మొక్కలు నాటుతారని, మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టైనా నాటాలని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మొక్కలు నాటడం కంటే చెట్లను నరికివేయడంపైనే ఎక్కువ దృష్టి కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుందని అన్నారు. 

రాజకీయాలపై కూడా అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలే జరుగుతున్నాయని, అభివృద్ధి అంశాలపై చర్చలు తక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
Advertisement
Ayyanna Patrudu
Andhra Pradesh Assembly Speaker
AP welfare schemes debate
Kerala development model
Environmental protection AP
AP politics and development

More Telugu News