ఫిఫా ఫైనల్స్ కు హాజరుకాను: అర్జెంటీనా అధ్యక్షుడు

Javier Milei will not attend FIFA World Cup final says Argentina President
  • వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన అర్జెంటీనా
  • తాను ఇంటి నుంచి మ్యాచ్ చూస్తానన్న అర్జెంటీనా అధ్యక్షుడు మిలీ
  • ముందు నుంచి వస్తున్న సెంటిమెంటే కారణమని వెల్లడి
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పెయిన్, అర్జెంటీనాల మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను ప్రపంచ కప్ ఫైనల్ పోటీలకు హాజరుకానని, ఇంటి నుంచే చూస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ పేర్కొన్నారు. ఓ సెంటిమెంట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రపంచ కప్ మ్యాచ్‌లలో తమ జట్టు ఓడిపోకుండా ఉండడం కోసం దేశాధ్యక్షులు ఆయా మ్యాచ్‌లకు హాజరుకారని జేవియర్ మిలీ చెప్పారు. ఈ సెంటిమెంట్‌ను అక్కడి నేతలు 1990 తర్వాత నుంచి పాటిస్తున్నారు. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్ తమ జట్టు ఆడే మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆయన వచ్చిన కొన్ని క్షణాలకే అర్జెంటీనా అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అప్పటి నుంచి ఆ దేశాధినేతలు తమ జాతీయ జట్ల మ్యాచ్‌లకు హాజరుకావడం మానేశారు. 

అర్జెంటీనా విజయం సాధించిన గత ఏడు మ్యాచ్‌లను టీవీలోనే చూశానని జేవియర్ మిలీ తెలిపారు. అంతేకాకుండా మ్యాచ్ సమయంలో ఎంత వేడిగా అనిపించినా తాను ఓ బరువైన జాకెట్‌ను ధరిస్తానని చెప్పారు. గతంలో స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనకు ఉక్కపోతగా అనిపించి ఆ జాకెట్ తీసేశానని, వెంటనే ప్రత్యర్థి జట్టు గోల్ చేసినట్లు తెలిపారు. దీంతో మ్యాచ్ జరిగే సమయంలో ఇంకెప్పుడూ దానిని తీయలేదన్నారు.

తానే కాకుండా దేశ ప్రజలు కూడా జాతీయ జట్ల మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు పలు సెంటిమెంట్లు పాటిస్తారని అర్జెంటీనా అధ్యక్షుడు పేర్కొన్నారు. వీటిని తాము ‘కాబాలాస్’ (ప్రత్యేక ఆచారాలు) అని పిలుస్తామన్నారు. భారత స్టాక్ మార్కెట్లపైనా ఫిఫా ఫైనల్ సెంటిమెంట్ ఉంటోంది. 1990 నుంచి ఫిఫా ప్రపంచ కప్ జరిగే ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలను నమోదు చేస్తోంది.
Advertisement
Javier Milei
Argentina vs Spain FIFA Final
FIFA World Cup
Javier Milei Superstition
Argentina Football Team
Cabala Rituals

More Telugu News