మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత.. కేర్ ఆసుపత్రిలో చికిత్స
- తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వాకిటి శ్రీహరి
- రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్న వైద్యులు
- శ్రీహరి ఆరోగ్య గురించి వాకబు చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మంత్రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు.
మంత్రి త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, పార్టీ నాయకులు మంత్రి వాకిటి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వాకిటి శ్రీహరి త్వరగా పూర్తి కోలుకుని ప్రజా సేవలో కొనసాగాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.