రూ.5తో ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్ రైలులో ఈ ప్రత్యేకతలు తెలుసా?
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు
- హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి
- ఆ విద్యుత్తే రైలు మోటార్లకు ఇంధనం
- టికెట్ ధర రూ.5 నుంచి రూ.25 మధ్య ఉండే అవకాశం
- భద్రతపై ప్రత్యేక దృష్టి.. లీకేజీని గుర్తించే సెన్సార్లు
- ఒకేసారి 2,600 మంది ప్రయాణించే సామర్థ్యం
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడం రవాణా రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు పర్యావరణహిత రవాణాకు కొత్త దారిని చూపిస్తోంది.
హైడ్రోజన్‌తోనే విద్యుత్
ఈ రైలుకు డీజిల్ అవసరం ఉండదు. ఇందులో నిల్వ చేసిన హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విద్యుత్‌తో రైలు మోటార్లు పనిచేస్తాయి. అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. వేగం పెంచాల్సిన సమయంలో ఆ విద్యుత్‌ను వినియోగిస్తారు.
కాలుష్యానికి గుడ్‌బై
సాధారణ డీజిల్ ఇంజిన్ల నుంచి కార్బన్ డైఆక్సైడ్, పొగ వెలువడుతుంది. హైడ్రోజన్ రైలులో మాత్రం అలాంటి ఉద్గారాలు ఉండవు. నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడం ప్రత్యేకత. శబ్దం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత పర్యావరణహిత రైళ్లలో ఒకటిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో రైల్వే కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ప్రయాణికులకు చౌక ప్రయాణం
ప్రస్తుతం ఈ రైలు హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తోంది. రోజుకు రెండు ట్రిప్‌లు వేస్తుంది. టికెట్ ధర రూ.5 నుంచి రూ.25 మధ్య ఉండే అవకాశం ఉంది. కొన్ని మెట్రో ప్రయాణాల కంటే, కొన్ని రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల కంటే కూడా ఇది చౌకగా ఉండటం విశేషం.
వేగం.. సామర్థ్యం కూడా ఎక్కువే
ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ట్రయల్ రన్‌లో గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 682 సీట్లు ఉంటాయి. ఒకేసారి సుమారు 2,600 మంది వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ రైలు సొంతం.
భద్రతకు పెద్దపీట
హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తున్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైడ్రోజన్ లీకేజీని వెంటనే గుర్తించే సెన్సార్లు అమర్చారు. అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. రైలు పనితీరును నిరంతరం పర్యవేక్షించే సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.