జులై 20 వరకు బతుకుతా.. లేదంటే దెయ్యంగా తిరిగొస్తా: సోనం వాంగ్‌చుక్
- జులై 20 వరకు దీక్ష కొనసాగిస్తానన్న వాంగ్‌చుక్
- విఫలమైతే దెయ్యంగా వస్తానంటూ వ్యాఖ్య
- 20న ర్యాలీలో పాల్గొనాలని పిలుపు
- 20వ రోజుకు చేరిన వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
జులై 20 వరకు తాను ఎలాగైనా బతుకుతానని.. లేదంటే దెయ్యంగా తిరిగి వస్తానని సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ అన్నారు. జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న తన నిరవధిక నిరాహార దీక్షను జులై 20 వరకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆ రోజు నిర్వహించే ‘సంసద్ చలో’ ర్యాలీలో స్వయంగా పాల్గొంటానని ప్రకటించాడు. ఒకవేళ ఆ ఉద్యమం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోతే దెయ్యంగా తిరిగి వస్తానని వ్యాఖ్యానించాడు.
విద్యా వ్యవస్థలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారానికి ఆయన దీక్ష 20వ రోజుకు చేరుకుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన 28వ రోజుకు చేరుకుంది. జులై 20న పార్లమెంట్ వరకు చేపట్టనున్న భారీ ర్యాలీని ఈ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిర్వాహకులు భావిస్తున్నారు. అదే రోజున పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.
జంతర్‌మంతర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన వాంగ్‌చుక్.. తన శరీరం బలహీనపడినా మనోబలం మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పాడు. అదే ఉత్సాహంతో జులై 20న అందరూ పార్లమెంట్‌కు శాంతియుతంగా తరలిరావాలని పిలుపునిచ్చాడు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో తమ వినతిని వినిపిద్దామని పేర్కొన్నాడు. తన దీక్ష విరమించాలని కోరడం కంటే ర్యాలీలో పాల్గొని ఉద్యమానికి బలం చేకూర్చాలని ప్రజలను కోరాడు.