సీదిరి అప్పలరాజుకు బిగుస్తున్న ఉచ్చు

Seediri Appalaraju faces imminent arrest as investigation intensifies
  • నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మృతికి కారణమమైన సీదిరి కొడుకు
  • సాక్ష్యాల తారుమారుకు సీదిరి ప్రయత్నించారంటూ కేసు
  • సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
అతి నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన కొడుకును కాపాడుకునేందుకు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించినట్టు స్పష్టంగా ఆధారాలు దొరకడంతో ఏ క్షణమైనా సీదిరి అరెస్టు కావచ్చునని తెలుస్తోంది. ఈ కేసులో కొడుకు ఆరవ్ వర్మను జైలుకు పంపిన పోలీసులు అప్పలరాజుపై బీఎన్‌ఎస్‌లోని 61(2), 238, 240, 242, 249, 49 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

కేసులో ఆరవ్ వర్మ ఏ1 కాగా, సీదిరి అనుచరుడు సిద్ధార్థ త్యాడి ఏ2.. సీదిరి ఏ3. ఆరవ్, సిద్ధార్థలను ఇప్పటికే పోలీసులు జైలుకు పంపించారు. ఇక ఇప్పుడు అప్పలరాజు వంతు అని పలాసలో చర్చ జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా సీదిరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అరెస్టు తప్పకపోతే బెయిల్, ఇతర రక్షణల విషయమై సీదిరి తన న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు, న్యాయవాదితో కలసి అప్పలరాజు భార్య జిల్లా జైలుకు వెళ్లి ఆరవ్‌ను కలసివచ్చారు. ప్రమాద ఘటన గురించి సీదిరి ఇప్పటివరకు నోరు విప్పలేదు. యాక్సిడెంట్‌కు రెండు రోజుల ముందే ఆరవ్ వర్మకు ఎల్‌ఎల్‌ఆర్ జారీ కావడంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసు వైసీపీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది.
Advertisement
Seediri Appalaraju
Aarav Varma
YSRCP
Palasa
Hit and run case
Evidence tampering

More Telugu News