హైదరాబాద్‌లో దారుణం.. మైనర్‌తో అసభ్య ప్రవర్తన.. స్థానికుల దాడిలో వ్యక్తి మృతి
- మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
- సీసీటీవీలో చూసి దాడి చేసిన స్థానికులు, కుటుంబసభ్యులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడి మృతి
- దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని కుల్సుంపురలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో స్థానికులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూం సముదాయంలో నివాసముండే అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి, నిలోఫర్ ఆసుపత్రి వద్ద టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసించే 9 ఏళ్ల బాలిక పట్ల ఇటీవల అతను అనుచితంగా ప్రవర్తించాడు. బాలికకు ముద్దులు పెట్టి, ఆమె ప్రైవేట్ భాగాలను తాకినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో అది చూసిన బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో అజీజ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి అజీజ్ మృతిచెందాడు.
ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.