ఏపీలో పెరుగుతున్న కరోనా.. అలర్ట్ అయిన ప్రభుత్వం

COVID 19 rising in AP government on alert
  • దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • ఏపీలో ఇప్పటి వరకు 13కి పైగా కేసుల నమోదు
  • ఇప్పటికే నలుగురు కోవిడ్ పేషెంట్ల మృతి
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి 340కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 13కి పైగా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. మహమ్మారి కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. హోం ఐసోలేషన్‌లో మరో ముగ్గురు ఉన్నారు. 

ఆసుపత్రిలో ఇద్దరు కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళ కరోనా బారిన పడగా ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కరోనా బారినపడిన పేషెంట్ల శాంపిల్స్‌ను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. 

ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కరోనా కేసులపై నేడు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Advertisement
Andhra Pradesh Government
COVID 19 Cases AP
Chandrababu Naidu
Corona Virus Update
AP Health Department Alert
Kadapa COVID Cases

More Telugu News