దొరసానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్
- కడప జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
- దొరసానిపల్లి జడ్పీ స్కూల్‌లో విద్యార్థులతో ముఖాముఖి
- మీకు మార్కులు రాకపోతే నా మార్కులు పోతాయన్న మంత్రి
- పాఠశాల పనితీరు, హాజరుపై అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, బోధన తీరును స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సంభాషించారు. ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తూ, "ఇరాన్-అమెరికా యుద్ధాన్ని ఎంతమంది గమనిస్తున్నారు?" అని ప్రశ్నించారు. శారీరక వ్యాయామం ప్రాముఖ్యతను వారికి వివరించారు.
విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నా భవిష్యత్ మీపైనే ఆధారపడి ఉంది. మీకు మంచి మార్కులు రాకపోతే, నా మంత్రి పదవికి మార్కులు కూడా పోయినట్లే" అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు పుస్తకాలు, యూనిఫాం వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీయగా, భోజనం బాగుందని విద్యార్థులు బదులిచ్చారు.
అనంతరం పాఠశాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో పాఠశాలకు కేవలం 1.3 స్టార్ రేటింగ్ రావడంపై ప్రిన్సిపాల్ ఏ.ధనలక్ష్మిని ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటంపై ఆరా తీసి, దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన పాఠశాలలపై ఎంఈవోలు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని సూచించారు. ఏపీని విద్యలో ఒక మోడల్‌గా నిలపడమే లక్ష్యమని, దీనికి ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి 4 స్టార్ రేటింగ్ సాధిస్తామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.
తనిఖీ అనంతరం మంత్రి నారా లోకేశ్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఫొటోలు దిగారు.