వేలంలో రికార్డు ధర పలికిన డైనోసార్ అస్థిపంజరం
- వేలంలో రికార్డు ధర పలికిన టీ-రెక్స్ అస్థిపంజరం
- సుమారు రూ. 482 కోట్లకు అమ్ముడైన 'గస్'
- ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజం
- ప్రైవేట్ సేకరణ వల్ల శాస్త్రీయ పరిశోధనలకు నష్టమని శాస్త్రవేత్తల ఆందోళన
వేలంలో ఓ డైనోసార్ అస్థిపంజరం సరికొత్త చరిత్ర సృష్టించింది. 'గస్' అనే ముద్దుపేరున్న టైరనోసారస్ రెక్స్ (టీ-రెక్స్) అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా 'గస్' నిలిచింది. మంగళవారం జరిగిన ఈ వేలంలో, కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏడుగురు పోటీదారుల మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ సాగింది.
ఈ అస్థిపంజరాన్ని 2021లో సౌత్ డకోటాలోని ఒక పశువుల క్షేత్రంలో కనుగొన్నారు. ఇందులో 183 శిలాజ ఎముకలు మాత్రమే లభ్యమాయ్యయి. ఇది డైనోసార్ దేహంలో సుమారు 63 శాతం మాత్రమే. దాదాపు 38 అడుగుల పొడవున్న ఈ డైనోసార్, సుమారు 6.6 నుంచి 7.2 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిందని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. 2024లో 44.6 మిలియన్ డాలర్లకు అమ్ముడైన 'అపెక్స్' అనే స్టెగోసారస్ అస్థిపంజరం పేరిట ఉన్న రికార్డును తాజాగా 'గస్' అధిగమించింది.
అమెరికా చట్టాల ప్రకారం, ప్రైవేట్ భూముల్లో లభించిన శిలాజాలను ప్రైవేట్ ఆస్తిగానే పరిగణిస్తారు. అందుకే వాటిని వాణిజ్యపరంగా విక్రయించడం సాధ్యమవుతోంది. అయితే, ఈ విక్రయంపై పురాజీవ శాస్త్రవేత్తలలో మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి అరుదైన శిలాజాలు మ్యూజియంలకు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల సేకరణలకు పరిమితమైతే, భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తి కొనుగోలు చేసిన ఈ అస్థిపంజరాన్ని భవిష్యత్తులో ఎక్కడ ప్రదర్శిస్తారనే వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.