రేవంత్ పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం దిగజారుతోంది.. కాగ్నిజెంట్ విశాఖకు వెళుతోంది: దాసోజు శ్రవణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం దిగజారుతోంది.. కాగ్నిజెంట్ విశాఖకు వెళుతోంది: దాసోజు శ్రవణ్

Dasoju Sravan slams Revanth Reddy over falling IT exports and job losses in Hyderabad
  • రేవంత్ ఐటీ పరిశ్రమను చంపేసే పని చేస్తున్నారన్న శ్రవణ్
  • 7 వేల ఉద్యోగాలు తగ్గాయని భట్టి అసెంబ్లీలోనే చెప్పరని వ్యాఖ్య
  • ఇప్పటికే లక్షా 20 వేల ఉద్యోగాలు పోయాయన్న శ్రవణ్
హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మినార్ గుర్తొచ్చేదని... ఇప్పుడు ఐటీ, ఫార్మా పరిశ్రమలకు హైదరాబాద్ పేరుగాంచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, వేగంగా పురోగమిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా ఉన్న పరిస్థితి నుంచి రేవంత్ పాలనలో దిగజారే దాకా వెళుతోందన్నారు. 2014లో 50 వేల కోట్ల రూపాయలు ఉన్న ఐటీ ఎగుమతులను 2023లో 2 లక్షల కోట్లు దాటేలా కేటీఆర్ శ్రమించారు. 3 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయి నుంచి కేటీఆర్ 9 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయికి హైదరాబాద్‌ను మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అందరూ సిగ్గుపడేలా పరిస్థితి మారిందన్నారు. 

రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేసే పని చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌కు కాగ్నిజెంట్ రాంరాం అన్నదని... 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు కల్పించే కాగ్నిజెంట్ విశాఖకు తరలుతోందని ఆరోపించారు. కాగ్నిజెంట్‌ను రెండు చోట్ల విస్తరించేలా గతంలో రెండు ఎంఓయూలు కుదిరాయి. అయినా కాగ్నిజెంట్ హైదరాబాద్ నుంచి విశాఖకు మారుతోందన్నారు. 7 వేల ఐటీ ఉద్యోగాలు తగ్గాయని భట్టి విక్రమార్క అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. 

రేవంత్ రెడ్డి ఉద్యోగాలను మింగేస్తున్నారని, కేటీఆర్ సగటున 60 వేల ఉద్యోగాలు పెంచితే రేవంత్ రెడ్డి 6 వేల ఉద్యోగాలు తగ్గిస్తున్నారన్నారు. ఇప్పటికే లక్షా 20 వేల ఉద్యోగాలు కోల్పోయామని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఏపీ సీఎంకు చప్రాసీనా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐటీ మీద ఆధారపడుతున్న వారి పరిస్థితి ఏమిటని ఆరోపించారు. దావోస్ పోయి రేవంత్ రెడ్డి పెద్దపెద్ద మాటలు చెప్పారని... ఆయన తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Dasoju Sravan
Revanth Reddy
Hyderabad IT Sector
Cognizant Visakhapatnam
Telangana IT Jobs
BRS News

More Telugu News