50 నామినేటెడ్ పదవులు ఈ నెలలోనే భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud says 50 nominated posts will be filled this month
  • మంచి పనితీరు కనబరిచిన వారిని రెన్యువల్ చేస్తామన్న మహేశ్ గౌడ్
  • పార్టీ పదవులపై మీనాక్షి నటరాజన్ తో చర్చించామని వెల్లడి
  • మండల కమిటీలలో డీసీసీల రిపోర్ట్ ఫైనల్ అని స్పష్టీకరణ
రాష్ట్రంలో 50 నామినేటెడ్ పదవులను ఈ నెలలోనే భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రస్తుతం మంచి పనితీరు కనబరిచిన వారిని రెన్యువల్ చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీ పదవులపై మీనాక్షి నటరాజన్‌తో చర్చించామని తెలిపారు. రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామన్నారు. 

మండల కమిటీలలో డీసీసీల రిపోర్ట్ ఫైనల్ అని స్పష్టం చేశారు. ఎంపీ రేణుకా చౌదరితో కూడా మాట్లాడానని మహేశ్ తెలిపారు. ఖమ్మంలో బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా రేణుక తనతో చెప్పారని అన్నారు. కానీ ఆ వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేశారు అని తెలిపారు. కూనంనేనితో తమకెలాంటి విభేదాలూ లేవన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రతి చిన్న విషయానికీ గాంధీభవన్‌ కు రావటం మానుకోవాలని క్యాడర్‌కు సూచించారు.
Advertisement
Mahesh Kumar Goud
Telangana Nominated Posts
TPCC Chief News
Revanth Reddy
Telangana Congress Party
DCC Appointments Telangana

More Telugu News