స్వల్ప లాభాల్లో స్థిరపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
- మధ్యాహ్నం తర్వాత ఒడుదొడుకుల్లో పయనించిన మార్కెట్లు
- 77,185 వద్ద సెన్సెక్స్, 24,074 వద్ద నిఫ్టీ స్థిరపడిన వైనం
- బ్యాంకింగ్, ఫైనాన్షిల్ సర్వీసెస్ రంగ షేర్లకు లాభాలు
- మెటల్ ఐటీ, రియాల్టీ షేర్లలో నష్టాలు
- నష్టాల నుంచి కోలుకున్న ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మెటల్, ఐటీ, రియాల్టీ రంగాల షేర్లలో నష్టాలు కనిపించాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 130.49 పాయింట్లు పెరిగి 77,185.43 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26.45 పాయింట్లు లాభపడి 24,074.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ-50 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ దాదాపు 1 శాతం పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు నిఫ్టీ మెటల్ సూచీ 1 శాతానికి పైగా పడిపోయి అత్యధిక నష్టాలు నమోదు చేసింది. ఐటీ, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. అయితే ఫార్మా రంగం వరుసగా రెండో రోజు లాభపడగా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ గత రెండు సెషన్ల నష్టాల నుంచి కోలుకుంది.
మార్కెట్ నిపుణుల ప్రకారం 24,000 స్థాయి వద్ద బలమైన కొనుగోళ్లు రావడంతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకుంది. ఈ స్థాయి భవిష్యత్‌లో కీలక మద్దతుగా ఉండనుందని, అంతర్జాతీయ పరిణామాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కమోడిటీ ధరలు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయని వారు పేర్కొన్నారు.