తిరుమలకు పోటెత్తిన భక్తులు... శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
- తిరుమల కొండపై విపరీతమైన రద్దీ
- వారాంతం కావడంతో పెరిగిన భక్తుల తాకిడి
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు దాటిన క్యూలైన్లు
- నిన్న ఒక్కరోజే రూ. 4.26 కోట్ల హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 24 నుంచి 30 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తుల రద్దీతో క్యూలైన్లు బయట పాచికాల్వ గంగమ్మ గుడి వరకు బారులు తీరాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సూచిస్తున్నారు.
నిన్న శుక్రవారం (జూలై 10) ఒక్కరోజే 73,265 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 39,690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ. 4.26 కోట్ల ఆదాయం లభించగా, 4.09 లక్షల లడ్డూలను విక్రయించారు. దాదాపు 2.98 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. వైద్య కేంద్రాల్లో 3,899 మందికి చికిత్స అందించినట్లు టీటీడీ వెల్లడించింది.