అఖిల్ కోసం తారక్ వాయిస్ ఓవర్.. మా పెద్దబ్బాయి అంటూ నాగార్జున భావోద్వేగం
- 'లెనిన్' సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నాగార్జున
- కుమారుడు అఖిల్ విజయంపై గర్వంగా ప్రశంసలు
- సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
- పట్టుదలతో అఖిల్ అనుకున్న విజయాన్ని సాధించాడని వ్యాఖ్య
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన అక్కినేని నాగార్జున తన కుమారుడి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన జూనియర్ ఎన్టీఆర్‌ను 'మా పెద్ద కొడుకు తారక్' అని సంబోధిస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
"అఖిల్‌కు చిన్నప్పటి నుంచే పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు తను విశ్రమించడు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో చేతికి గాయమైనప్పటికీ పట్టుదలతో చిత్రీకరణ పూర్తి చేశాడు. ఈ రోజు తన విజయాన్ని చూస్తుంటే తండ్రిగా చాలా గర్వంగా ఉంది' అని నాగార్జున పేర్కొన్నారు. తనకు నాగచైతన్య, అఖిల్ రెండు కళ్ల లాంటి వారని, అఖిల్‌కు ఒక మంచి విజయాన్ని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందమంతా ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు..
'లెనిన్' చిత్రంలోని శ్రీరాంపురం, భారతం మిట్ట గ్రామాల నేపథ్యాన్ని, పాత్రలను తన గంభీరమైన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. "ఒక్క మాట అడగ్గానే మా పెద్దబ్బాయి తారక్ వెంటనే అంగీకరించాడు. అతనికి నా ప్రత్యేక కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తిరుమల సందర్శించినప్పుడు కూడా తన కోసం కాకుండా, అఖిల్ విజయం కోసమే భగవంతుడిని ప్రార్థించానని నాగార్జున ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నాగార్జున అన్నారు. సినిమా విడుదలకు ముందు రోజు భాగ్యశ్రీ తనకు ఫోన్ చేసి ఎంతో ఆందోళన వ్యక్తం చేసిందని ఆయన వెల్లడించారు. తాను ఎంతో కష్టపడుతున్నప్పటికీ తగిన గుర్తింపు రావడం లేదని ఆ అమ్మాయి బాధపడిందని, అయితే కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుందని తాను ధైర్యం చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు.