వింబుల్డన్‌లో సచిన్ దంపతులతో గిల్.. వైరల్ అవుతున్న ఫొటోలు
- వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సందడి చేసిన గిల్
- లండన్‌లోని సెంటర్ కోర్టు రాయల్ బాక్స్‌కు ప్రత్యేక ఆహ్వానం
- సచిన్, అంజలితో కలిసి మ్యాచ్ వీక్షణ
- రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న నాలుగో భారత కెప్టెన్
- సారాతో గిల్ రిలేషన్ ప్రచారాన్ని గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు
భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సందడి చేశాడు. లండన్‌లోని సెంటర్ కోర్టులో ఉన్న రాయల్ బాక్స్‌కు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. వీరు ముగ్గురూ కలిసి కూర్చున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వింబుల్డన్ రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న నాలుగో భారత క్రికెట్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ గౌరవం దక్కింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్‌ను వింబుల్డన్ నిర్వాహకులు ‘క్రికెట్ రాయల్టీ’గా అభివర్ణించడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా రాయల్ బాక్స్‌లో ప్రత్యేక అతిథిగా కనిపించాడు.
ఇటీవల శుభ్‌మన్ గిల్ మరో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లోనూ సందడి చేశాడు. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన ఫార్ములా-1 రేసును ప్రత్యేక అతిథిగా వీక్షించాడు. ప్యాడక్‌ను సందర్శించిన గిల్.. ఫార్ములా-1 ప్రముఖులతో ముచ్చటించి రేసింగ్ వాతావరణాన్ని ఆస్వాదించాడు.
మరోవైపు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయినప్పటికీ వింబుల్డన్‌లో సచిన్ పక్కనే గిల్ కనిపించడంతో నెటిజన్లు మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.