ఆఫీసులో ఈ ఒక్క అలవాటు.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపొచ్చు!
- ల్యాప్‌టాప్ వైపు వంగి కూర్చోవద్దంటున్న నిపుణులు
- మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరిక
- మెడ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశమూ ఉంటుందని వెల్లడి
- ప్రతి గంటకు ఒకసారి లేవాలని సూచన
- మానిటర్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకుంటే మేలు
రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు ఒక అలవాటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ వైపు తలను ముందుకు వంచి గంటల తరబడి పనిచేయడం మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది కేవలం మెడ నొప్పికే కాదు.. రక్తప్రసరణ, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపొచ్చని వివరిస్తున్నారు.
సాధారణంగా ఎనిమిది గంటల ఉద్యోగ సమయంలో చాలామంది ఆరు గంటలకుపైగా కుర్చీలోనే కూర్చుంటారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన కదలిక తగ్గిపోతుంది. ముఖ్యంగా తలను ముందుకు వంచి పనిచేసే అలవాటు మెడపై అదనపు ఒత్తిడి పెంచుతుంది. దీంతో మెదడుకు వెళ్లే రక్తప్రసరణ కూడా కొంత మేర ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ అలవాటును వైద్యులు ‘ఫార్వర్డ్ హెడ్ పోశ్చర్’గా పిలుస్తారు. దీని వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరగడం, తలనొప్పి, అలసట, భుజాల నొప్పి, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. రోజుకు ఆరు గంటలకుపైగా కంప్యూటర్ ముందు పనిచేసేవారిలో బాడీ బ్యాలెన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యను తగ్గించాలంటే ఒకేసారి గంటల తరబడి కూర్చోకుండా మధ్య మధ్యలో లేవాలి. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి నిలబడి కొద్దిసేపు నడవడం మంచిది. మెడ, భుజాలకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ల్యాప్‌టాప్ లేదా మానిటర్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకోవాలి. దీంతో మెడపై ఒత్తిడి తగ్గుతుంది.
ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నడవడం, వీలైతే కొంతసేపు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించడం, రోజంతా తగినంత నీరు తాగడం కూడా ఉపయోగపడతాయి. సహజ కాంతి ఉండే చోట పనిచేయడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు రోజూ వ్యాయామం చేయడం వల్ల తగ్గే అవకాశం ఉంది. అయితే వ్యాయామం చేస్తున్నామని రోజంతా ఒకే చోట కూర్చోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోజుకు కనీసం 60 నుంచి 75 నిమిషాల మోస్తరు శారీరక వ్యాయామం చేస్తూ, మధ్య మధ్యలో శరీరాన్ని కదిలిస్తే మెదడు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.