ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి

Telangana Housing Board Logo Competition For LIG Scheme With One Lakh Prize
  • విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి
  • జూలై 12లోగా డిజైన్లు సమర్పించాలని సూచన
  • క్యూర్ పరిధిలో ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో
తెలంగాణ ప్రభుత్వం 'క్యూర్' పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి అధికారిక లోగో రూపకల్పన కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రజల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ లోగోను డిజైన్ చేసిన విజేతకు రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల వారు తమ డిజైన్లను 2026, జూలై 12వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది.

హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ ఈ వివరాలను వెల్లడించారు. లోగో పోటీలో పాల్గొనాలనుకునే డిజైనర్లు, విద్యార్థులు, కళాకారులు, ఇతర సృజనకారులు తమ ఎంట్రీలను హౌసింగ్ బోర్డ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంపవచ్చని తెలిపారు.

ఇప్పటికే ఈ పథకానికి పేరు సూచించేందుకు జూన్‌ నెలలో నిర్వహించిన పోటీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 14,000 ఎంట్రీలు రాగా, ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. విజేతను త్వరలోనే ప్రకటించి, పథకం ప్రారంభోత్సవ వేడుకలో బహుమతిని అందజేస్తామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు.
Advertisement
Telangana Housing Board
LIG Housing Scheme
Logo Design Competition
VP Gautham
Telangana Government

More Telugu News