బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు: బండి భగీరథ్ కేసులో హైకోర్టుకు పోలీసులు

Bandi Bhagirath will influence witnesses if granted bail Telangana Police tell High Court
  • పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడికి బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసులు
  • హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన దర్యాప్తు అధికారులు
  • మైనర్‌ను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు
బండి సాయి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసులో ఈ మేరకు పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తమ అఫిడవిట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. విజయవర్ధన్ జులై 3న దాఖలు చేసిన కౌంటర్‌లో పలు కీలక వివరాలను వెల్లడించారు. 17 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్న భగీరథ్, ఆమెను లోబర్చుకుని 2025 నుంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శ్రీరామ్ గార్డెన్స్, నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న భగీరథ్, తాను నిర్దోషినని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.
Bandi Bhagirath
Bandi Sanjay son case
Telangana High Court
POCSO case Hyderabad
Bandi Bhagirath bail petition
Telangana Police counter affidavit

More Telugu News