తీవ్ర వేడికి భగభగమంటున్న అమెరికా.. 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రద్దు!
- 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ వేడుకలకు సిద్ధమైన అమెరికా
- విపరీతమైన వేడి కారణంగా వేడుకలు రద్దు
- తీవ్రంగా ప్రభావితమవుతున్న విద్యుత్ వ్యవస్థ
మరోవైపు, వేడిమికి తట్టుకోలేక అస్వస్థతకు గురైన ఒక యువతిని ఆసుపత్రికి తరలించారు. గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫేర్ కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. న్యూయార్క్లో హీట్ ఇండెక్స్ 105 ఫారెన్హీట్ (41 డిగ్రీల సెల్సియస్)కి చేరుకుంది. విద్యుత్ గ్రిడ్లపై భారీ ఒత్తిడి పడుతోంది. వేలాది మందికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఈ తీవ్ర వేడి అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాలు, ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫిఫా ఈ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో హైడ్రేషన్ బ్రేకులు తప్పనిసరి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వేడిని ఎదుర్కోవడానికి కూలింగ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్ సమయం పొడిగించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న విశేష సందర్భం కావడంతో భారీ ఉత్సవాలకు ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు ఆ ఉత్సవాలపై పెను ప్రభావం చూపాయి.