గోల్ ఆఫ్ ది టోర్నమెంట్.. కేప్ వెర్డే ఆటగాడి కళ్లు చెదిరే గోల్‌తో మెస్సీ టీమ్ షాక్.. వీడియో ఇదిగో!
- ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాకు ఊహించని పోటీ
- రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో కేప్ వెర్డేపై 3-2తో కష్టపడి గెలుపు
- అదనపు సమయంలో కేప్ వెర్డే ప్లేయర్ కాబ్రల్ అద్భుత గోల్
- వీరోచితంగా పోరాడి ఓడిన కేప్ వెర్డే.. క్వార్టర్స్‌లోకి అర్జెంటీనా
ఫిఫా వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత పోరు ఫుట్‌బాల్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన కేప్ వెర్డే వీరోచితంగా పోరాడి ఓడింది. ఈ థ్రిల్లర్‌లో లియోనెల్ మెస్సీ బృందం 3-2 తేడాతో అతికష్టం మీద విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న కేప్ వెర్డే జట్టు.. ప్రపంచ ఛాంపియన్‌కు చుక్కలు చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. ఎక్స్‌ట్రా టైం ఆరంభంలో అర్జెంటీనా మరో గోల్ చేసి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక, అర్జెంటీనా విజయం ఖాయమనుకున్న తరుణంలో కేప్ వెర్డే ప్లేయర్ సిడ్నీ లోప్స్ కాబ్రల్ కళ్లు చెదిరే గోల్ చేశాడు. బాక్స్ ఎడ్జ్ నుంచి అతను కొట్టిన షాట్, బంతి కర్వ్ తీసుకుని నేరుగా టాప్ కార్నర్‌లోని గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో స్కోరు 2-2తో సమం కాగా, అర్జెంటీనా శిబిరం నిశ్చేష్టమైంది. ఈ గోల్ 'గోల్ ఆఫ్ ది టోర్నమెంట్' అవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, చివరి నిమిషాల్లో అర్జెంటీనా మరో గోల్ చేసి 3-2 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత కేప్ వెర్డే మరో గోల్ చేయలేకపోవడంతో అర్జెంటీనా విజయం సాధించింది. ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన కేప్ వెర్డే జట్టు ఫుట్‌బాల్ ప్రపంచం మనసు గెలుచుకుంది.