ఆ చైనా యాప్‌లను తొలగించండి.. ఈ-రిక్షాల నిలిపివేతపై కేంద్రం సీరియస్!
- ఈ-రిక్షా యాప్‌లపై కేంద్రం చర్యలు
- రెండు చైనా యాప్‌ల తొలగింపు ఆదేశం
- బ్లూటూత్‌తో వాహనాలు నిలిచిపోతున్న వైనం
- భద్రతా లోపాలే ప్రధాన కారణం
- ప్లే స్టోర్, యాప్ స్టోర్‌కు ఆదేశాలు
ఈ రెండు యాప్‌లు బ్లూటూత్ ద్వారా లిథియం-అయాన్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతాయి. బ్యాటరీ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించినప్పటికీ కొందరు వీటిని ఈ-రిక్షాల పవర్‌ను దూరం నుంచే నిలిపివేయడానికి ఉపయోగిస్తున్నారు. యాప్‌లోని డిశ్చార్జ్ స్విచ్ నొక్కగానే వాహనం ఒక్కసారిగా ఆగిపోతోంది.
చాలా ఈ-రిక్షాల్లో ఉపయోగించే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలో పాస్‌వర్డ్, ఇతర భద్రతా ధ్రువీకరణ లేకపోవడమే ఈ సమస్యకు కారణమని అధికారులు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న ఎవరైనా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి వాహనాన్ని నిలిపివేయగలుగుతున్నారు. తిరిగి అదే యాప్ ద్వారా ఆన్ చేస్తేనే వాహనం మళ్లీ పనిచేస్తోంది.
ఇలాంటి ప్రమాదకర యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో కూడా ప్రజల భద్రతకు ముప్పుగా మారే యాప్‌లను గుర్తించి యాప్ స్టోర్ల నుంచి తొలగించే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.