బెంగళూరు ఫ్యాన్స్‌కు పండగే: నథింగ్ నుంచి అదిరిపోయే 'నథింగ్ ఫోన్ (4b) ఆర్సీబీ ఎడిషన్'.. సేల్ ఎప్పుడంటే..!

Nothing Phone 4b RCB Edition announced for Bangalore fans sale details here
  • నథింగ్ బ్రాండ్ నుంచి కొత్తగా 'Nothing Phone (4b) RCB ఎడిషన్
  • ఆర్సీబీ వరుస విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక డిజైన్‌తో విడుదల 
  • 7న బెంగళూరులోని 'నథింగ్ స్టోర్'లో మాత్రమే పరిమిత స్టాక్ లభ్యం 
  • అదే రోజున స్టాండర్డ్ 'Nothing Phone (4b)' అధికారికంగా విడుదల
  • స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానున్న కొత్త ఫోన్
ప్రముఖ టెక్ బ్రాండ్ 'నథింగ్'.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్‌ కోసం ఒక అద్భుతమైన ఫోన్‌ను ప్రకటించింది. వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌షిప్ విజయాలను అందుకున్న ఆర్సీబీ టీమ్ గౌరవార్థం, నథింగ్-ఆర్సీబీ భాగస్వామ్యానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రత్యేకమైన 'Nothing Phone (4b) RCB ఎడిషన్'ను విడుదల చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఎడిషన్ స్పెషాలిటీ
ఈ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఆర్సీబీ టీమ్ రంగులైన 'రెడ్' కలర్ థీమ్‌తో, మ్యాట్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకమైన ఆర్సీబీ బ్రాండింగ్ ఉంటుంది. ఇది కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, ఫ్యాన్స్‌కు ఒక 'కలెక్టబుల్ ఐటమ్'గా నిలవనుంది.

సేల్ వివరాలు
ఈ ఫోన్  ఈ నెల 7న మాత్రమే బెంగళూరులోని అధికారిక 'నథింగ్ స్టోర్'లో అందుబాటులో ఉంటుంది. ఇది చాలా పరిమిత సంఖ్యలో వస్తున్నందున 'మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం' పద్ధతిలో విక్రయించనున్నారు.

స్టాండర్డ్ 'నథింగ్ ఫోన్ (4b)' ఫీచర్లు
ఆర్సీబీ ఎడిషన్‌తో పాటు, నథింగ్ సంస్థ తన స్టాండర్డ్ నథింగ్ ఫోన్(4బి)'ని జులై 7 మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్‌లో అధికారికంగా విడుదల చేయనుంది. దీని ప్రధాన ఫీచర్లు ఇలా ఉండనున్నాయి:

ప్రాసెసర్: శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఇది గత మోడళ్ల కంటే వేగవంతంగా పనిచేయనుంది.
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
కెమెరా: 50MP మెయిన్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ (పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో)
బ్యాటరీ: 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం
డిజైన్: నథింగ్ బ్రాండ్ ప్రత్యేకత అయిన ‘ట్రాన్స్‌పరెంట్ డిజైన్’, గ్లైఫ్ ఇంటర్‌ఫేస్  దీనిలో కొనసాగనున్నాయి.

నథింగ్ ఫోన్ (4b) ఆర్సీబీ ఎడిషన్ ధరలు, ఇతర పూర్తి స్పెసిఫికేషన్లను జులై 7న జరిగే గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో సంస్థ వెల్లడించనుంది.  
Nothing Phone 4b RCB Edition
Royal Challengers Bangalore
Nothing Phone 4b launch date
Bengaluru Nothing Store
Snapdragon processor smartphone
RCB limited edition phone

More Telugu News