ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్... 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Project Hail Mary Hollywood Blockbuster When is the OTT Streaming Date
  • జులై 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం
  • ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6000 కోట్లకు పైగా వసూళ్లు
  • భారత్‌లో 'డూన్ 2', 'ఇంటర్‌స్టెల్లార్' చిత్రాలను మించిన వసూళ్లు
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, జులై 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రైమ్ వీడియో అధికారికంగా ఒక ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది.

ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. భారత్‌లో వసూళ్ల పరంగా ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డూన్ 2’ వంటి భారీ చిత్రాలను అధిగమించడం విశేషం. గతేడాది విడుదలైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తర్వాత మన దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన అంతర్జాతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.

మానవాళిని కాపాడే క్రమంలో ఒక వ్యోమగామి ఒంటరిగా అంతరిక్షంలో చేసే సాహస యాత్రే ఈ చిత్ర కథాంశం. థియేటర్లలో భారీ విజయం సాధించడంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Project Hail Mary
Ryan Gosling
Amazon Prime Video
Project Hail Mary OTT Release Date
Phil Lord Christopher Miller
Hollywood Sci Fi Comedy Movies

More Telugu News