‘లాకప్ 2’లో రామ్ కపూర్‌కు కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!
- లాకప్ 2` షోలో ప్రత్యేకంగా కనిపించిన కంగనా రనౌత్
- మెరుగుపడాలనుకుంటే నిన్ను నువ్వు సమర్థించుకోవద్దని రామ్ కపూర్‌కు హితవు
- హోస్ట్ ఫరా ఖాన్‌తోనూ రామ్ కపూర్ వాగ్వాదం
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ షోకు ఫరా ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. షో ఐదో ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ప్రవర్తనను సమీక్షించేందుకు కంగనా రనౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నేరుగా రామ్ కపూర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరు ఈ ఆటను అస్సలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ జైలు వాతావరణం మీకు సరిపడదని భావిస్తే, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని నిలదీశారు. దీనికి రామ్ కపూర్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. "మీలో మార్పు రావాలని మీరు నిజంగా కోరుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఆపండి" అని కంగనా స్పష్టం చేశారు.
ఇదే ఎపిసోడ్‌లో అంతకుముందు హోస్ట్ ఫరా ఖాన్ కూడా రామ్ కపూర్‌కు చురకలంటించారు. సాధారణంగా వివిధ ప్రాజెక్టులలో కథానాయకుడిగా కనిపించే రామ్, ఈ షోలో మాత్రం వెనుకబడిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై రామ్ కపూర్ తీవ్రంగా స్పందిస్తూ.. "అయితే నన్ను పంపించేయండి.. నేను మారను, నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది" అని పేర్కొన్నారు. దీనిపై ఫరా ఖాన్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. "పరిస్థితులకు అనుగుణంగా మారని వారు డైనోసార్లలా కనుమరుగైపోతారు" అని వ్యాఖ్యానించారు.
మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కంగనా, ఈసారి అతిథిగా వచ్చి కంటెస్టెంట్ల ప్రవర్తనపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.