వచ్చే ఎన్నికలు 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. చూసుకుందాం: జగన్

Next elections are Mavigan vs Amaravati says YS Jagan Mohan Reddy
  • తాము మావిగన్ కు కట్టుబడి ఉన్నామన్న జగన్
  • మావిగన్ కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని వ్యాఖ్య
  • ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్ ను చేరుస్తామని స్పష్టీకరణ

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్ కే కట్టుబడి ఉన్నామని... వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్ కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


'జగన్ అమరావతికి వ్యతిరేకం' అంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. అమరావతి పేరుతో చంద్రబాబు సాగిస్తున్న స్కామ్‌లను, అవినీతిని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అవినీతి లేని రాజధాని కావాలనేదే తన ఆకాంక్ష అని, అందుకే ఈ మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకే ఓటు వేస్తారని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్ ను చేరుస్తామని స్పష్టం చేశారు.

YS Jagan Mohan Reddy
Mavigan vs Amaravati
Andhra Pradesh Elections
YSRCP Capital Policy
Amaravati Scams
AP Political News

More Telugu News