ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. ఐపీఎల్ కింగ్ వైభవ్ సూర్యవంశీని పక్కనబెట్టడంపై రగులుతున్న రచ్చ!

India suffer humiliating defeat against Ireland controversy erupts over Vaibhav Suryavanshi exclusion
  • ఐర్లాండ్ చేతిలో టీమిండియా 0-2తో  సిరీస్ ఓటమి 
  • వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు
  • వైభవ్‌ను ఆడించాల్సిందన్న సునీల్ గవాస్కర్ 
  • సెలక్టర్లను వెనకేసుకొచ్చిన రవిచంద్రన్ అశ్విన్  
ఐర్లాండ్ గడ్డపై టీమిండియా ఘోర పరాజయం.. భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. లో-ర్యాంక్ జట్టు చేతిలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ స్టార్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసి 'ఆరెంజ్ క్యాప్'తో పాటు 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డును సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్ లాంటి చిన్న సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అందరూ ఆశించారు. యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది సరైన వేదిక అయినప్పటికీ, మేనేజ్‌మెంట్ మాత్రం పాత కోర్ టీమ్‌నే నమ్ముకుంది. ఈ నిర్ణయమే జట్టు ఘోర ఓటమికి కారణమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఎంపికపై భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. "వైభవ్ సూర్యవంశీ ఉన్న ఫామ్‌కు అతడిని ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడించాల్సింది. జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే సిరీస్ తొలి మ్యాచ్ నుంచైనా అతడికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలి" అని డిమాండ్ చేశాడు. మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సైతం సెలెక్షన్ తీరును తప్పుపట్టగా, మనోజ్ తివారీ కోచింగ్ స్టాఫ్ పక్షపాత ధోరణిపై మండిపడ్డాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, వైభవ్‌కు జింబాబ్వే లాంటి టూర్లలో ఛాన్స్ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. 
Vaibhav Suryavanshi
India vs Ireland
Sunil Gavaskar
Indian Cricket Team
IPL Orange Cap winner
India Ireland T20 series

More Telugu News