విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన

Chandrababu Naidu practices yoga with Baba Ramdev in Vijayawada
  • విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా
  • సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. వేలాది మంది యోగా సాధకులతో కలిసి వారు యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ఉత్సాహంగా యోగా సాధన చేశారు. ముఖ్యంగా, బాబా రామ్‌దేవ్ స్వయంగా ముఖ్యమంత్రితో అనులోమ-విలోమ ప్రాణాయామం చేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం రామ్‌దేవ్ శిష్యులు ప్రదర్శించిన క్లిష్టమైన యోగాసనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, యోగాను నిత్యజీవితంలో అంతర్భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు తదితర ప్రముఖులు పాల్గొని యోగా సాధన చేశారు. కార్యక్రమ ప్రారంభంలో వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో స్టేడియం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.                                
Go Back to Shorts
Chandrababu Naidu
Baba Ramdev
International Yoga Day Vijayawada
Nara Lokesh
Andhra Pradesh Yoga Celebrations
Indira Gandhi Municipal Stadium

More Telugu News