దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం!
- రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు
- ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం
- బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం!
- బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు అకస్మాత్తుగా ఆగడం, అదే సమయంలో మినీబస్సు డ్రైవర్ తగినంత సురక్షిత దూరం పాటించకపోవడం, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం (Consulate General of India) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. స్థానిక అధికారులతో కలిసి బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.