బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం
- అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్
- బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం
- కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన
- పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా
- తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
తమిళనాడులో సొంతంగా బలాన్ని పెంచుకోకుండా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనే కేంద్ర నాయకత్వ వ్యూహాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే ‘తమిళ్ ఫస్ట్’ అనే నినాదంతో ఓ సరికొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై నిష్క్రమణ తమిళనాడులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. దూకుడుగా సాగించిన ప్రచారం, ప్రత్యర్థులపై చేసిన పదునైన విమర్శలే ఆ రాష్ట్రంలో బీజేపీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టాయని నిపుణులు చెబుతున్నారు.