పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా
- ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య
- రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ
- జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందని అన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా? అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవ్వదా? అంటూ ప్రశ్నించారు.
రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తుపై ముందుకెళ్తామని రామచందర్ రావు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.