రాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను... పట్టపగలే చీకట్లు!
- రాజస్థాన్‌లోని పలు జిల్లాలను ముంచెత్తిన ఇసుక తుఫాను
- చురు, బికనీర్, శ్రీ గంగానగర్‌పై తీవ్ర ప్రభావం
- అరగంట పాటు దట్టమైన ధూళితో అంధకారంగా మారిన వాతావరణం
- పశ్చిమ అలజడుల కారణంగానే ఈ తుఫానులు అని వెల్లడి
- ప్రస్తుతానికి ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు
రాజస్థాన్‌లోని పలు జిల్లాలను శనివారం శక్తిమంతమైన ఇసుక తుపాను ముంచెత్తింది. దట్టమైన ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా అంధకారంగా మారింది. ఇసుక తుపాను అనంతరం భారీ వర్షం కురిసింది. ఈ తుపాను ప్రభావం చురు జిల్లాపై అధికంగా కనిపించగా, బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది.
సుమారు 30 నిమిషాల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ గాలులకు ఇసుక భారీగా కొట్టుకొచ్చి రోడ్లు, నివాస ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రహదారులపై కొన్ని అడుగుల మేర ఇసుక పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను సమయంలో దారి కనిపించక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ అలజడుల ప్రభావం వల్లే ఈ ప్రాంతంలో తరచూ ఉరుములు, వర్షాలతో కూడిన ఇసుక తుపానులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపానుల వల్ల తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, రవాణా, విద్యుత్ సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలుగుతోంది.
శ్రీ గంగానగర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటడం అక్కడి తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లోనూ బికనీర్, షెఖావతి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.