'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్
- కొన్ని వారాలుగా చిత్రంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు గుర్తించిన యూనిట్
- హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్
- ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు గుర్తింపు
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని ఆరోపిస్తూ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వచ్చే వారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ గుర్తించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నవారిని గుర్తించారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
సోషల్ మీడియాలో కొన్ని వారాలుగా 'పెద్ది' చిత్రంపై ప్రతికూల ప్రచారం జరుగుతుండటంతో చిత్ర యూనిట్ ఆయా ఖాతాల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది. పదేపదే జరుగుతోన్న ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ ఘటనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు 'పెద్ది' సినిమా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.