బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ కేసు
- చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- కూకట్‌పల్లి డీసీపీ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ
ముందుగా నిందితుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, భారీ భద్రత నడుమ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా కూకట్‌పల్లి డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగుతోంది. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు మరిన్ని సెక్షన్లను చేర్చిన నేపథ్యంలో, ఈ మూడు రోజుల కస్టడీ విచారణ అత్యంత కీలకంగా మారనుంది.