మస్క్ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్ చైనా మిలిటరీ ఆఫీసరా?
- ట్రంప్ చైనా పర్యటనలో మస్క్
- ఆయనపై చైనా గూఢచర్యం నెరిపినట్లు వార్తలు
- బీజింగ్ విందులో మస్క్ వెనుక వెయిట్రెస్
- ఆమె చైనా మిలిటరీ కమాండర్ అని బ్లాగర్ జెంగ్ ఆరోపణ
- ఆమె డ్రెస్ కింద గన్ అని అనుమానం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో.. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌పై అక్కడి ప్రభుత్వం నిఘా పెట్టిందనే సంచలన వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. బీజింగ్‌లో జరిగిన అధికారిక విందులో ఆయన వెనుక నిలబడిన ఓ వెయిట్రెస్ నిలబడింది. ఆమె సాధారణ హోటల్ సిబ్బంది కాదని, చైనా సైన్యానికి చెందిన అత్యున్నత అధికారిణి అని ప్రముఖ బ్లాగర్ ఆరోపించారు.
వెయిట్రెస్ రూపంలో ఉన్నదెవరు?
స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. ట్రంప్ గౌరవార్థం బీజింగ్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక విందు ఏర్పాటు చేసింది. దాంట్లో మస్క్ వెనుక ఎరుపు రంగు దుస్తుల్లో నిలబడిన మహిళ చైనా మిలిటరీకి చెందిన ఓ బెటాలియన్ కమాండర్ మేజర్ చెంగ్ చెంగ్ అని జెంగ్ పేర్కొన్నారు. చైనా సైనిక వేడుకలకు సంబంధించిన ఆపరేషనల్ మ్యాన్యువల్స్ రాయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు.
రెడ్ డ్రెస్ కింద గన్?
మేజర్ చెంగ్ చెంగ్‌కు సంబంధించిన పాత యూనిఫాం ఫొటోలు, ప్రస్తుత విందు ఫొటోలను జెంగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఆ వెయిట్రెస్ ధరించిన రెడ్ కలర్ డ్రెస్ కింద గన్ లేదా ఏదైనా నిఘా పరికరం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎంతవరకు నిజమనేది మాత్రం అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అటు చైనా ప్రభుత్వం కూడా ఈ విమర్శలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చైనాకు ఇలాంటి చరిత్ర ఉందా?
పాశ్చాత్య దేశాలను, ప్రముఖులను టార్గెట్ చేయడానికి చైనా ఇలా గూఢచర్యానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదని భద్రతా నిపుణులు చెబుతున్నారు. గతంలో కాలిఫోర్నియాలో అమెరికా రాజకీయ నాయకులను ట్రాప్ చేయడానికి ‘ఫాంగ్ ఫాంగ్’ అనే మహిళతో చైనా హనీట్రాప్ ఆపరేషన్ నడిపిన దాఖలాలున్నాయి. విదేశీ టెక్ లీడర్లు చైనా మార్కెట్లోకి అడుగుపెట్టే సమయంలో.. అక్కడి ప్రభుత్వం ఇచ్చే ఆతిథ్యం వెనుక ఇలాంటి రహస్య నిఘా కచ్చితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజ్జర్ హత్య వెనుక చైనా?
బ్లాగర్ జెంగ్ గతంలోనూ చైనా గూఢచర్య వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 2023లో కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ హస్తం ఉందని చెప్పారు. భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఇరికించి పశ్చిమ దేశాలతో సంబంధాలను దెబ్బతీయడానికే చైనా ఆ హత్య చేయించిందని ఆమె వాదించారు.