- కొత్తపట్నం వద్ద తీరం దాటిన మురసు తుఫాన్
- తెల్లవారుజామున కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం
- ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు, పలుచోట్ల కూలిన చెట్లు
- విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని తెలిపిన అధికారులు
మురసు తుపాను తీరం దాటిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అధికారులను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ రాత్రి ఒంటి గంటకు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకిందని, ఉదయం 6:30 గంటల కల్లా పూర్తిగా తీరం దాటుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత వరకు నివారించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్ల పరిస్థితిపై ఆరా తీయగా, ప్రస్తుతం ఎక్కడా స్తంభాలు పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
సమీక్షలో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయి వివరాలను సీఎంకు అందించారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు. రెండుచోట్ల చెట్లు కూలగా, వాటిని వెంటనే తొలగించామన్నారు. నెల్లూరులో 7 చోట్ల, ఒంగోలు జిల్లాలో 5 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి తొలగించారని సంబంధిత కలెక్టర్లు వివరించారు.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంకలో వర్షం ఎక్కువగా ఉందని, గుంటూరు జిల్లాలో వర్షపాతం నమోదైనా ఎలాంటి నష్టం జరగలేదని కలెక్టర్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో చిరు జల్లులు పడుతున్నాయని, మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్తగా కొన్ని కుటుంబాలను శిబిరాలకు తరలించామని కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నుంచి ఆర్టీజీఎస్‌లోనే ఉండి తుపాను పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. రాత్రి 10 గంటలకు ఒకసారి, తెల్లవారుజామున మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా, ప్రతి గంటకు అధికారుల నుంచి సమాచారం తీసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుపాను సహాయక చర్యలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు సీఎంకు తెలియజేశారు.