బీజేపీ ఎన్నికల దొంగ.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rahul Gandhi Alleges BJP Election Theft in Bengal Assam
  • బెంగాల్, అసోంలో బీజేపీ ఎన్నికలను దొంగిలించిందన్న రాహుల్
  • ఎన్నికల సంఘం సాయంతో ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపణ
  • బెంగాల్‌లో 100 సీట్లు దొంగిలించారన్న మమత వాదనకు మద్దతు 
  • మధ్యప్రదేశ్, హర్యానా తరహాలోనే ఇక్కడా జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత
  • ప్రజాస్వామ్య సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆందోళన
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో గెలవలేదని, ఎన్నికల సంఘం (ఈసీ) సహకారంతో ఫలితాలను దొంగిలించిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మేరకు సోమవారం తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో 100కు పైగా సీట్లను బీజేపీ తారుమారు చేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో తాము ఏకీభవిస్తున్నామని రాహుల్ స్పష్టం చేశారు. బెంగాల్, అసోంలలో ఎన్నికల ఫలితాలను స్పష్టంగా తారుమారు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని అన్నారు.

"ఎన్నికలను దొంగిలించడం, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడం.. ఇక వాళ్లకు మిగిలిన దారి ఏముంది!" అని రాహుల్ తన పోస్టులో ప్రశ్నించారు. బీజేపీ కేవలం ఎన్నికలనే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Rahul Gandhi
BJP
West Bengal Elections
Assam Elections
Election Commission
Electoral Fraud
Mamata Banerjee
TMC
Indian National Congress

More Telugu News