సెలబ్రిటీలు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు: గీతా మాధురి

Geetha Madhuri reveals shocking secrets about celebrity couples
  • నోయల్ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన గీతా మాధురి
  • తాను కాఫీ షాపులకు వెళ్లినప్పుడల్లా ఎవరో ఒక సెలబ్రిటీ జంట కనబడుతుందన్న గీత
  • వాటి గురించి చెబితే కాపురాలు కూలిపోతాయని వ్యాఖ్య

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అనవసరమైన విషయాల జోలికి ఆమె వెళ్లరు. గాయకుడు నోయెల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె... సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.  


ఇంటర్వ్యూలో గీత మాట్లాడుతూ... తాను చాలా అరుదుగా కాఫీ షాపులకు వెళతానని, కానీ వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక సెలబ్రిటీ జంట తనకు అక్కడ 'రెడ్ హ్యాండెడ్'గా దొరికిపోతారని చెప్పారు. "నేను వెళ్ళిన ప్రతిసారీ ఎవరో ఒకరు నాకు దొరుకుతూనే ఉంటారు. నేను చూసిన వాటి గురించి ఇప్పుడు నోరు విప్పితే చాలా మంది కాపురాలు కూలిపోవడం ఖాయం" అని ఆమె నవ్వుతూనే సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ వీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చూసిన ఆ 'సీక్రెట్ కపుల్స్' ఎవరు? వారు టాలీవుడ్ ప్రముఖులేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. 
Go Back to Shorts
Geetha Madhuri
Geetha Madhuri interview
Singer Geetha Madhuri
Tollywood celebrities
Celebrity couples
Tollywood gossip
Noel Sean
Secret affairs
Telugu cinema news

More Telugu News