ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ'... మరో కీలక పాత్ర పరిచయం
- ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ'
- సినిమాలో కీలకమైన 'సింహా' పాత్రలో నటిస్తున్న శ్రవణ్ రెడ్డి
- సింహా పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
- పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో సినిమా విడుదల
- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ 'అగధ'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక పాత్రను పరిచయం చేశారు. ఇందులో 'సింహా' అనే ముఖ్య పాత్రలో నటుడు శ్రవణ్ రెడ్డి నటిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో శ్రవణ్ రెడ్డి చీకటి నడుమ చేతిలో కాగడా పట్టుకుని ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. అతని చుట్టూ ఉన్న వాతావరణం, చూపుల్లోని తీవ్రత చూస్తుంటే.. రహస్యాన్ని ఛేదించే ప్రమాదకరమైన ప్రయాణంలో ఉన్న వ్యక్తిగా అతని పాత్ర ఉండబోతుందని స్పష్టమవుతోంది. గతంలో ఎమ్మెస్ రాజు తన 'డర్టీ హరి' చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'మహాదేవి' పాత్రలో కామాక్షి భాస్కర్ల నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌కు మంచి స్పందన వచ్చింది. 85 రోజుల షూటింగ్, భారీ సెట్ వర్క్, 45 నిమిషాల నిడివి గల వీఎఫ్ఎక్స్‌తో 'అగధ' ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని దర్శకుడు ఎమ్మెస్ రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.