పేద విద్యార్థిని చదువుకు మంత్రి కోమటిరెడ్డి రూ.10 లక్షల సాయం
- నల్గొండ జిల్లాకు చెందిన పరిమళకు ఆర్థిక సాయం
- ఐఐటీ మద్రాస్‌లో చదివి జర్మనీలో మాస్టర్స్ సీటు సాధించిన విద్యార్థిని
- కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిన సహాయం
ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్ష ఉన్నా, ఆర్థిక స్తోమత అడ్డంకిగా మారిన ఒక నిరుపేద విద్యార్థినికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. జర్మనీలో ఉన్నత చదువుల కోసం ఎంపికైన సదరు విద్యార్థినికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన పరిమళ అనే విద్యార్థిని చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తోంది. ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, జర్మనీలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసేందుకు సీటు సాధించింది. అయితే, పరిమళ తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో విదేశీ విద్యకు అవసరమైన భారీ ఖర్చులను భరించడం వారికి భారంగా మారింది.
ఈ విషయాన్ని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, తమ 'కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్' ద్వారా ఆ విద్యార్థినికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సకాలంలో అందిన ఈ సాయం తన విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా పరిమళ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది.