చంద్రబాబుకు సానా సతీష్ బర్త్ డే విషెస్.. పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంస
Add ap7am to your home Screen

చంద్రబాబుకు సానా సతీష్ బర్త్ డే విషెస్.. పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంస

Chandrababu Naidu Birthday Wishes from Sana Satish Babu
  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు
  • రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు
  • పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అని ప్రశంస
  • ఐటీ, డ్వాక్రా విప్లవాలను గుర్తు చేసిన ఎంపీ సతీష్ బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు 'ఎక్స్' వేదికగా చంద్రబాబుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబు పాలనా దక్షతను, దార్శనికతను సతీష్ బాబు తన పోస్టులో కొనియాడారు. "సంస్కరణల సంతకం.. 76 ఏళ్ల ప్రస్థానంలో అచంచల విశ్వాసం" అంటూ తన అభినందనలు ప్రారంభించారు. "హైటెక్ విజన్‌తో ఐటీ విప్లవాన్ని తెచ్చినా, డ్వాక్రా విప్లవంతో ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు నింపినా.. ప్రతి ఇంట్లోనూ అభివృద్ధి ముద్ర వేసినా.. అది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం" అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, చంద్రబాబును "పాలనలో ఒక డిక్షనరీ, సంస్కరణల్లో ఒక ట్రెండ్ సెట్టర్" అని అభివర్ణించారు. తమ అందరికీ మార్గదర్శి, అపర చాణక్యుడు అయిన చంద్రబాబు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సానా సతీష్ బాబు తన పోస్టును ముగించారు.
Advertisement
Sana Satish Babu
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Birthday wishes
TDP
Political News
AP Politics
Reforms
Governance

More Telugu News