వెండితెరపై గంభీరమైన స్వరంతో, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే 'కలెక్షన్ కింగ్' మంచు మోహన్‌ బాబుకు తన మనవడి రూపంలో ఒక క్యూట్ సవాల్ ఎదురైంది. మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త మంచు తన తాతయ్యనే అనుకరిస్తూ అల్లరి చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో, తాత-మనవళ్ల మధ్య సాగిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది.


సాధారణంగా మోహన్‌ బాబు ఎదురుపడితేనే ఇండస్ట్రీలో ఎవరైనా ఎంతో వినయంగా ఉంటారు, కానీ చిన్నారి అవ్రామ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తాతయ్య సైలెంట్‌గా ఉండమని వారించినా, ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో ‘ఏంటీ బాబూ..’ అంటూ ఎదురు ప్రశ్నించి మోహన్‌ బాబునే ఆశ్చర్యపరిచాడు. 


మనవడి ముద్దు ముద్దు మాటలకు ఆ గంభీరమైన నటుడు కూడా మెత్తబడిపోయి, ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. చివరకు ఎంతో స్టైల్‌గా ‘బై బాబూ’ అంటూ అవ్రామ్ అక్కడి నుంచి వెళ్లిన తీరు చూస్తుంటే, డైలాగ్ కింగ్ ముందే డైలాగులు పేల్చే వారసుడు వచ్చేసాడని అభిమానులు మురిసిపోతున్నారు. ఎంతటి కఠినమైన క్రమశిక్షణ గల వారైనా మనవడి అల్లరి ముందు లొంగిపోవాల్సిందేనని ఈ వీడియో నిరూపిస్తోంది.

Play video