నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- నూతన వధూవరులు ప్రజయ్ సేనారెడ్డి, జాహ్నవిలను ఆశీర్వదించిన లోకేశ్
- వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుక
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం నెల్లూరులో పర్యటించారు. నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ (నుడా) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. నూతన వధూవరులు ప్రజయ్ సేనారెడ్డి, డాక్టర్ జాహ్నవిలను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ రాకతో వేడుక ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పలువురు ఆసక్తి చూపారు. పలువురు పోటీలు పడి లోకేశ్ తో సెల్ఫీ ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. కార్యక్రమంలో భాగంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో లోకేశ్ కాసేపు ముచ్చటించారు.