"20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. అమెరికా ఇరాన్ ల అణు చర్చల్లో వీడని చిక్కుముడి"
- అణు కార్యక్రమాలపై 20 ఏళ్ల నిషేధానికి అమెరికా ప్రతిపాదన
- 5 ఏళ్ల వరకైతే ఓకే అంటూ అంగీకారం తెలిపిన ఇరాన్
- పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం
ఈ 15 ఏళ్ల వ్యత్యాసమే చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణమైందని అధికార వర్గాల సమాచారం. చర్చలు విఫలమైన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ మొండి వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ హర్మూజ్ జలసంధిలో నౌకాదళ దిగ్బంధనానికి ఆదేశించారు. సుమారు 15 యుద్ధనౌకలతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన అమెరికా, ఇరాన్ నౌకాశ్రయాల నుంచి జరిగే రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న యురేనియం నిల్వలను కూడా దేశం దాటించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.