బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ
- ఐదేళ్ల క్రితం నాటి నందిగ్రామ్ ఫలితమే ఇప్పుడు బెంగాల్ అంతటా వస్తుందన్న మోదీ
- బెంగాల్ అభివృద్ధికి, చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్న ప్రధాని
- బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యలు
ఈ ఎన్నికలు బెంగాల్ అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధి విషయంలో అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు రంగాల్లో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని మోదీ పేర్కొన్నారు.
బెంగాల్ యువతను తృణమూల్ కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందని, ఆ పాపాలు ఊరికే పోవని హెచ్చరించారు. బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాగానే కేంద్ర పథకాలు ఇక్కడ అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలు, కుంభకోణాలపై విచారణ జరిపి, కారకులైన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. శరణార్థులకు ఆశ్రయమిస్తామని, కానీ చొరబాటుదారులను తరిమికొడతామని స్పష్టం చేశారు.