బుమ్రా బౌలింగ్‌లో స్కోరు చేస్తానని చెప్పి చేసి చూపించాడు... అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi Scores Against Bumrah Impresses Irfan Pathan
షార్ట్స్‌లో చూడండి
"గత ఏడాది బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాను. ఈసారి అతడి బౌలింగ్‌లో పరుగులు చేయాలి"... ఇది ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పెట్టుకున్న లక్ష్యం. చెప్పడమే కాదు, గతరాత్రి  ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దూకుడుగా ఆడి దాన్ని చేసి చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

వైభవ్ ప్రదర్శనపై స్పందించిన ఇర్ఫాన్, అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. "వైభవ్ ఒక యువ సంచలనం. 15 ఏళ్ల వయసులో వైట్ బాల్ క్రికెట్‌లో ఇంతటి పరిణతితో కూడిన ప్రదర్శన అసాధారణం. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది, అతడిపై పరుగులు చేస్తానని చెప్పి, చేసి చూపించాడు. తన లక్ష్యాన్ని చేరుకున్నాడు" అని ఇర్ఫాన్ కొనియాడాడు.

"ఈ కుర్రాడిని ఎక్కువ కాలం వేచి చూసేలా చేయొద్దు. ఇప్పుడే జాతీయ జట్టులోకి తీసుకుంటే, అతడు సుమారు 20 ఏళ్ల పాటు దేశానికి సేవలందించగలడు" అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అగ్రశ్రేణి బౌలర్లను సైతం ఎదుర్కొని నిలకడగా రాణిస్తుండటంతో, ఇర్ఫాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Irfan Pathan
Jasprit Bumrah
IPL 2024
Mumbai Indians
Indian Cricket Team
BCCI
Cricket
Young Talent
Vaibhav Suryavanshi batting

More Telugu News