సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఎందుకంటే?

David Warner Arrested in Sydney for Drunk Driving
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్‌ను సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. మారుబ్రాలో పోలీసులు రోడ్డుపై బ్రీత్ టెస్టింగ్‌ను నిర్వహిస్తుండటం చూసిన వార్నర్ తన కారును రోడ్డు పక్కన పార్కు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేయగా పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.

అతని రక్తంలో అల్కాహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఆస్ట్రేలియాలోని నిబంధనల ప్రకారం అతను పరిమితి కంటే రెట్టింపు మద్యం సేవించాడు. దీనితో మారుబ్రా పోలీసు అధికారులు వార్నర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి వార్నర్ వచ్చే నెలలో కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.
Go Back to Shorts
David Warner
David Warner arrest
Australia cricketer
Sydney
drunk driving
breathalyzer test

More Telugu News