Irfan Pathan: సీఎస్కే వరుసగా ఓడిపోతుండటంపై... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!

Irfan Pathan Analysis on CSKs Consecutive Losses in IPL 2024
షార్ట్స్‌లో చూడండి

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు ఓటములను మూటగట్టుకోవడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలింగ్ వైఫల్యాలను ఎత్తిచూపాడు. సీఎస్కే సమస్య బ్యాటింగ్‌లో లేదని, బౌలింగ్‌లోనే ఉందని స్పష్టం చేశాడు.


ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ పేలవ ప్రదర్శన జట్టును ముంచేస్తోందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో 10 ఓవర్లలో 100కి పైగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం దారుణమన్నాడు. నూర్ అహ్మద్ రన్-అప్ యాంగిల్, హ్యాండ్ పొజిషన్‌లో లోపాల వల్ల అలైన్‌మెంట్ తప్పుతోందని సాంకేతిక కారణాలను వివరించాడు. 


అలాగే, ఆర్సీబీ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70*)ను కట్టడి చేయడంలో సీఎస్కే బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించాడు. టిమ్ డేవిడ్‌కు ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేసి అతనికి అనుకూలంగా మార్చారని, మిడిల్ లేదా లెగ్ స్టంప్‌పై బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పఠాన్ విశ్లేషించాడు. ఈ వ్యూహాత్మక లోపాలే సీఎస్కే పరాజయానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నాడు.

Go Back to Shorts
Irfan Pathan
CSK
Chennai Super Kings
IPL 2024
RCB
Noor Ahmad
Tim David
Cricket Analysis
Irfan Pathan Analysis

More Telugu News