Leander Paes: నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

Leander Paes I May Not Be Ganguly But I Am Bengali
షార్ట్స్‌లో చూడండి
తన పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ తాను మాత్రం బెంగాలీనే అని ఇటీవల బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నారు. తాను బెంగాలీ వ్యక్తిని కాదంటూ వస్తోన్న విమర్శలపై ఆయన స్పందించారు. బహిరంగ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు "మీరు బెంగాలీయేనా" అని అడుగుతుంటే బాధగా ఉందని అన్నారు. 

తమ కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయని వెల్లడించారు. తనవి మాత్రం భారతీయమూలాలే అని స్పష్టం చేశారు. తాను కోల్‌కతాలో పుట్టానని, తన టెన్నిస్ ప్రయాణం సౌత్ క్లబ్‌లో ప్రారంభమైందని లియాండర్ తెలిపారు. ఇక్కడి లా మార్టినియర్ పాఠశాలలో చదువుకున్న తాను, కోల్‌కతా నగర మైదానాల్లోనే ఆడుకున్నానని అన్నారు. ఈ నగరానికి గొప్ప క్రీడా చరిత్ర ఉందని అన్నారు.

కానీ ప్రస్తుత బెంగాల్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం లేదని విమర్శించారు. గత సంవత్సరం అర్జెంటినా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ కోల్‌కతాలో పర్యటించిన సమయంలో చోటుచేసుకున్న గందరగోళాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బెంగాల్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. క్రీడా రంగానికి చెందినవారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అన్నారు.
Go Back to Shorts
Leander Paes
Tennis

More Telugu News